Monday, September 20, 2010

HAPPY PEACE DAY TO ALL


ప్రతి ఏటా సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశాలు, జాతులు, సమూహాలు తీవ్ర ఘర్షణల్లో మునిగి తేలుతున్నప్పటికీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణ ప్రకటిస్తూ శాంతికోసం పలు కార్యక్రమాలను నిర్వహించడం పరిపాటి.ప్రపంచానికి శాంతి అవసరం గురించి ప్రబోధించే ఈ మహా దినం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో శాంతి ఘంట మోగిస్తారు.

ప్రపంచంలోని అన్ని ఖండాలనుంచి చిన్నారుల పంపిన నాణాలను కలిపి ఈ గంటను తయారు చేస్తారు. అంతర్జాతీయ సంఘీభావానికి ప్రతీకలా ఈ గంట గుర్తించబడుతోంది. ఈ గంటను ఐరాసకు ఓ బహుమతిగా జపాన్ అందచేసింది. యుద్ధం మానవులపై చూపుతున్న దారుణ ప్రభావానికి ఇది ఒక సంకేతంలా ఉంటోంది. ఆ గంటపై ఇలా రాసి ఉంది. "సంపూర్ణ ప్రపంచ శాంతి వర్థిల్లాలి

No comments:

Post a Comment